ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (17:21 IST)

మీల్ మేకర్ పిల్లలు తింటే.. క్యాన్సర్ కణాల ఉత్పత్తికి..?

Meal Maker
Meal Maker
సోయా బీన్స్‌తో చేసిన భోజనంలో కొన్ని పోషకాలు ఉన్నప్పటికీ, దానిని తీసుకోవడం వల్ల కొన్ని ఇతర అనారోగ్య ప్రభావాలు కూడా కలుగుతాయి. అలాగే మీల్ మేకర్ సోయా బీన్స్ నుంచి తయారు చేస్తారు. మీల్ మేకర్‌లో కొన్ని పోషకాలు వున్నప్పటికీ.. కొన్ని దుష్ప్రభావాలు తప్పవు. 
 
చాలా మంది శాకాహారులు మాంసాహార భోజనానికి ప్రత్యామ్నాయంగా మీల్ మేకర్‌ని భావిస్తారు. మీల్ మేకర్ పిల్లలు ఎక్కువగా తినడం వల్ల పోషకాహార లోపం, శరీర అలర్జీలు వస్తాయి. మీల్ మేకర్‌ను ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ కణాల ఉత్పత్తికి దారితీస్తుంది. 
 
మీల్ మేకర్ దీర్ఘకాలిక మంట, ఖనిజ లోపాలను కలిగిస్తుంది. ఇందులోని ప్రోటీన్ జీర్ణక్రియను నిరోధిస్తుంది. మీల్ మేకర్‌లోని ఫైటోఈస్ట్రోజెన్‌లు మూత్రపిండాల వైఫల్యం, కిడ్నీలో స్టోన్స్ ప్రమాదాన్ని పెంచుతాయి. బాలింతలు, గర్భిణీ స్త్రీలు మీల్ మేకర్ తీసుకోకపోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.