ఆర్థరైటిస్ తగ్గేందుకు శొంఠిని వాటితో కలిపి తీసుకుంటే...
అల్లంను మసాలాలో ఉపయోగిస్తుంటాము. కానీ ఎండు అల్లం... అంటే శొంఠిని కూడా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగించబడుతుంది. శొంఠి మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఆర్థరైటిస్ నుండి శ్వాసకోశ వ్యాధులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, దంతాలు, వైరల్, పొత్తికడుపు నొప్పి మొదలైన వాటిని నిరోధిస్తుంది.
మలబద్ధకం తొలగించడానికి, కొత్తిమీర-శొంఠి కషాయాలను తయారు చేసి, క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అలాగే కీళ్లనొప్పులు తగ్గేందుకు శొంఠి చాలా మేలు చేస్తుంది. వాతవ్యాధి నుండి విముక్తి పొందాలంటే ఉసిరికాయ, శొంఠి, మిరియాలను సమపాళ్లలో కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీళ్లలో కాసేపు మరిగించి ఆ నీటిని వడపోసి చల్లార్చి తాగాలి. ఇలా చేస్తే ఆర్థరైటిస్ నుండి ఉపశమనం పొందుతారు.
శొంఠి కీళ్ల నొప్పులకు చాలా మేలు చేస్తుంది. శొంఠి, జాజికాయను గ్రైండ్ చేసి నువ్వుల నూనెలో కలపాలి. ఈ నూనెలో గుడ్డ కట్టును నానబెట్టి, కీళ్ల నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా చేయడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. శొంఠి జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. షుగర్, క్యాన్సర్, డయేరియా మొదలైన వ్యాధులను కూడా శొంఠి ఎదుర్కోగలదు.