బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 అక్టోబరు 2021 (21:36 IST)

నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడిపాలలో కొద్దిగా శొంఠిపొడి వేసి...

అజీర్తి నుంచి ఉపసమనం పొంది, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఉదయాన్నే మొదటగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. కెఫన్ ఉన్న పదార్థాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి.
 
ఉపాహారంగా నూనె లేకుండా వండిన తేలికగా జీర్ణమయ్యే పదార్థాలనే తీసుకోవాలి. ఇది రోజువారీ పనులను ఉల్లాసంగా చేయడానికి పనిచేస్తుంది. నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడిపాలలో కొద్దిగా శొంఠిపొడి, ఏలకుల పొడి వేసుకొని తాగాలి. ఏలకులు పిత్తాన్ని, అల్లం కఫాన్ని తొలగిస్తాయి.
 
మధ్యాహ్నం రెండు గంటల లోపే గట్టి ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకునే వన్నీ తేలికగా జీర్ణమయ్యేవిగా ఉండాలి. రాత్రి భోజనం వీలైనంత తక్కువగా ఉండాలి. ఆహారంలో ఆకుకూరల వంటి పీచు పదార్థాలు మెండుగా ఉన్నవి తినడానికి వీలుకానప్పుడు తొక్కతో సహా తినగలిగిన పండును తప్పని సరిగా చేర్చాలి.