శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (14:50 IST)

పండిన బొప్పాయి కంటే.. పచ్చి బొప్పాయి మేలు.. ఎందుకంటే?

బొప్పాయి పండు వలన మన శరీరానికి చాలా పోషకాలు అందుతాయని మనకు తెలుసు. పండు బొప్పాయి వలన మాత్రమే కాకుండా పచ్చి బొప్పాయి వలన కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి బొప్పాయిని తరచుగా తినడం వలన ఉదర సంబంధ రోగాలు నయం అవుతాయి. పచ్చి బొప్పాయి తినడం వలన రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి. 
 
ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల అది తింటే శరీరంలో గాయాలు త్వరగా మానిపోతాయి. చర్మ సౌందర్యానికి కూడా బొప్పాయి చాలా బాగా ఉపయోగపడుతుంది. పండిన బొప్పాయి కంటే పచ్చిబొప్పాయిలో ఎక్కువ యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. 
 
పొపైన్, చైమో పొపైన్‌లు మన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. స్థూలకాయంతో బాధపడేవారు, అజీర్తితో బాధపడేవారు ఇది తినడం వలన ప్రయోజనం ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కడుపులోని మలినాలను బయటకు పంపుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది. కంటి సంబంధిత వ్యధులు, విటమిన్ల లోపం రాకుండా చూస్తుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదు.