మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (18:18 IST)

పండ్లు, కూర ముక్కలను కలిపి తీసుకుంటున్నారా? (video)

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడంతో ఒబిసిటీ ఆవహిస్తోంది. దీంతో కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలను డబ్బాల్లో కలిపి తీసుకుంటూ వుంటారు. ఇలా తీసుకుంటే హెల్దీ అనుకుంటారు. కూరగాయ ముక్కల్లోని కేలరీలకు, పండ్ల

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడంతో ఒబిసిటీ ఆవహిస్తోంది. దీంతో కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలను డబ్బాల్లో కలిపి తీసుకుంటూ వుంటారు. ఇలా తీసుకుంటే హెల్దీ అనుకుంటారు.

కూరగాయ ముక్కల్లోని కేలరీలకు, పండ్ల ముక్కల్లోని కేలరీలకు తేడా వుంటుంది. అందుకే పండ్లు తిన్న తర్వాత నాలుగైదు గంటలు ఆగి కూరగాయల ముక్కలు తీసుకోవచ్చు. భోజనం తర్వాత పండ్లను తీసుకోవడం చేయకూడదు. భోజనానికి రెండు గంటల ముందు అర కప్పు మోతాదులో ఏవైనా పండ్ల ముక్కలను తీసుకోవచ్చును.
 
కొందరు పండ్ల ముక్కలను పంచదార కలిపి తీసుకోవడం లేదా తేనెతో కలిపి తీసుకోవడం చేస్తుంటారు. అయితే ఈ విధంగా పండ్లు తీసుకోవడం మంచిది కాదు. పండ్లను, కూరగాయ ముక్కలను వేటితోనూ జతచేయకుండా తీసుకోవాలి. ఇక సలాడ్లలో ఉప్పు కలుపుకుని తినకూడదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. పుల్లగా ఉండే పళ్లను, తీయటి పళ్లను కలిపి తినకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.