గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (17:52 IST)

అబ్బే.. స్మార్ట్‌ఫోన్లు.. టాయిలెట్ల సీటు కంటే హీనమా?

ఆధునికత అనేది ప్రస్తుతం అందరినీ కంప్యూటర్లకు, స్మార్ట్‌ఫోన్లకు కట్టిపడేస్తుంది. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుంటే.. ఆఫీసును వీడిన నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్లు మనుషుల్ని కట్టిపడేస్తున్నాయి.

ఆధునికత అనేది ప్రస్తుతం అందరినీ కంప్యూటర్లకు, స్మార్ట్‌ఫోన్లకు కట్టిపడేస్తుంది. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుంటే.. ఆఫీసును వీడిన నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్లు మనుషుల్ని కట్టిపడేస్తున్నాయి. ఇక అర్థరాత్రికైనా స్మార్ట్‌ఫోన్లను పక్కనబెట్టే వారి సంఖ్య దాదాపు చాలా తక్కువే. 
 
స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో.. అధికంగా వీటిని వాడే వారు అంధులుగా మారే అవకాశం వుందని తాజా అధ్యయనంలో తేలింది. వీటి స్క్రీన్లపై నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా అంధత్వం తప్పదనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
బ్లూ లైట్ కారణంగా… కంటిలోని సున్నితమైన కణాలు, రెటీనా పొర పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని, కంటిలోని గుడ్డు పూర్తిగా దెబ్బతిని అంధులవుతారని, అది మెల్లమెల్లగా నయం చేయలేని కంటి జబ్బుగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేగాకుండా రాత్రిపూట ఎక్కువ సమయంలో ఫోన్, కంప్యూటర్ వాడకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
 
అంతేగాకుండా.. స్మార్ట్‌ఫోన్లు శుభ్రతలో అతి దారుణంగా వుంటాయట. నిత్యం వాడే స్మార్ట్‌ఫోన్ మీద మురికి, టాయిలెట్ల కంటే డర్టీగా వుంటుందట. ఇది చాలా ప్రమాదకరమని పరిశోధకులు చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్ల మీద బాత్రూమ్‌ల్లో ఉపయోగించే టాయిలెట్ సీటు కంటే అధిక సూక్ష్మక్రిములు వుంటాయని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
నిత్యం చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వాడే చాలామంది వాటిని శుభ్రం చేసుకోవడంపై ఆసక్తి చూపరు. అందుకే అవి టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువ సూక్ష్మ క్రిములతో నిండిపోయి చర్మ వ్యాధులకు, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎవరైతే స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం వరకే పరిమితం చేసుకుంటారో, శుభ్రం చెయ్యరో ఆ ఫోన్ స్క్రీన్స్ మీద టాయిలెట్ సీట్ కంటే మూడురెట్లు అధికంగా సూక్ష్మక్రిములు వ్యాపిస్తాయని పరిశోధకులు తేల్చారు. ఈ సూక్ష్మ క్రిములను కొలిస్తే టాయిలెట్ సీట్, ఫ్లష్ మీద కంటే మూడు రెట్లు అధికంగా ఉంటున్నట్లు తెలియవచ్చింది. 
 
ఏరోబిక్ బ్యాక్టీరియా, ఈస్ట్, మౌల్డ్ అనే మూడు రకాల సూక్ష్మక్రిములు స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై ఉండే హానికరమైన బ్యాక్టీరియా అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి టాయిలెట్ల కంటే అశుభ్రంగా వుండే స్మార్ట్ ఫోన్లను శుభ్రం చేసుకోకుండా వాడితే ఎంత ప్రమాదమో గ్రహిస్తే మంచిదని లేకుంటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.