గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (15:30 IST)

పొట్లకాయ రసాన్ని తలకు పట్టిస్తే.. లాభమేంటి?

పొట్లకాయ ఆరోగ్యానికే కాదు శిరోజాల పోషణకు కూడా మెరుగ్గా పనిచేస్తుంది. విటమిన్‌-ఎ, బి, సిలతోబాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ కలిగివుండే పొట్లకాయ రసాన్ని తలకి పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే తలల

పొట్లకాయ ఆరోగ్యానికే కాదు శిరోజాల పోషణకు కూడా మెరుగ్గా పనిచేస్తుంది. విటమిన్‌-ఎ, బి, సిలతోబాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ కలిగివుండే పొట్లకాయ రసాన్ని తలకి పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు తగ్గుతుంది. పొట్లకాయ శరీరంలోని టాక్సిన్లను సమర్థంగా తొలగిస్తుంది. మూత్రపిండాలూ, మూత్రాశయం పనితీరునీ మెరుగుపరుస్తుంది. 
 
గొంతులోని కఫాన్ని తగ్గించడంతో పాటు శ్వాసవ్యవస్థ పనితీరుకీ పొట్లకాయ దోహదపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి కూడా పొట్లకాయ తోడ్పడుతుంది. అందుకే దీన్నుంచి తీసిన రసం రోజూ రెండు కప్పులు తాగితే హృద్రోగ సమస్యలు తగ్గుతాయట. బీపీనీ తగ్గిస్తుంది. మలేరియా జ్వర బాధితులకి పొట్లకాయ రసం మేలు చేస్తుంది. ఇది యాంటీబయోటిక్‌గానూ పనిచేస్తుంది.
 
పొట్లకాయలో కేలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి. పీచు పదార్థం పొట్లకాయలో అధికంగా ఉంటుంది. రెగ్యులర్‌గా పొట్లకాయ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.