1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 6 జనవరి 2016 (14:39 IST)

మెదడుకు హాని కలిగించే గురక... నివారించడమెలా?

గురక అనేది సాధారణ సమస్య. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. గురకపెడుతూ మీరు గాఢంగా నిద్ర పోవచ్చుగానీ మీ చుట్టూ ఉన్న వారికి తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. గురక అనేది నయం చేయలేని వ్యాధి కాదు. ఇది శ్వాసించే సమయంలో సహజంగా ఎదుర్కొనే సమస్య. నిద్రించే సమయంలో వ్యక్తి శ్వాసపీల్చేటప్పుడు, శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గురకకు దారితీస్తుంది. ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే కొన్నిచిట్కాలు పాటిస్తే సరి..
 
గురక పెట్టే వారితో పక్కవారినేకాక వారు కూడా చిక్కుల్లో పడతారని తాజా అధ్యనం చెబుతోంది. ఎంత త్వరగా గురకపెడతారో అంతే త్వరగా జ్ఞాపకశక్తిని కోల్పోతారని నిర్ధారణ అయ్యింది. వారు పలు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. 
 
వెల్లకిలా పడుకునే కంటే పక్కకు తిరిగి పడుకుంటే శ్వాస హాయిగా పీల్చవచ్చు. దీనివల్ల గురక రాదు.
 
ఇదే గురక వల్ల గుండె జబ్బులు, మధుమేహం కూడా వచ్చిపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. 
 
నిద్రలో తక్కువ ఆక్సిజన్‌ పీల్చడం వల్ల మెదడు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఇలా మెదడులో కణాలు దెబ్బతినడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురతాయి. గురక పెట్టేవారు వైద్యులను సంప్రదించి ఆరోగ్య నియమాలు పాటించాలి.
 
పొగతాగటం కూడా గురకకు ఒక కారణం. ఈ అలవాటు గొంతులో మంట కలిగిస్తుంది. శ్వాస కష్టంగా తీసుకోవలసి వుంటుంది. పొగతాగటం మానేస్తే సమస్య చాలావరకు తగ్గిపోతుంది.