గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 29 మార్చి 2021 (22:28 IST)

మన శరీరం రోజుకి నాలుగు లీటర్ల నీరు కోల్పోతుంది కాబట్టి...

ఎండాకాలం రాగానే ఉష్ణోగ్రతకు తగ్గట్లు శరీరానికి నీటి అవసరం కూడా బాగా పెరుగుతుంది. మన శరీరపు బరువులో డబ్భైశాతం నీరు నిండి ఉందని. నీరు మన శరీరంలో అన్ని భాగాల్లో నిండి ఉన్నా ఊపిరితిత్తులు, మెదడు, రక్తం వంటి ద్రవాలు, లాలాజలం, అలాగే జీర్ణాశయ అవయవాలు స్రవించే ద్రవాలు మొదలైనవాటిలో అధికశాతంలో నీరు నిండి ఉంటుంది.
 
సాధారణంగా మనకు దాహం వేసినప్పుడే మన శరీరానికి నీరు అవసరమని మనం భానిస్తాం. అది నిజమే అయినప్పటికీ, తాజా పరిశోధనలు మన శరీరంలో కొన్ని లేదా అన్ని భాగాలలో నీటిశాతం లోపిస్తే ఎన్నోఇతర సంకేతాలను జారీ చేస్తాయని చెబుతున్నాయి. ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేయడంవల్ల ఎన్నో తీవ్రమైన వ్యాధులు సంక్రమిస్తాయి.
 
మనలో చాలామంది పని సమయాల్లో ఎక్కువగా ఎయిర్ కండిషన్డ్ గదుల్లో గడుపుతుంటాం. కాబట్టి సహజంగా మనకి దాహం వేయదు, అలా అని మనశరీరానికి నీరు అవసరం లేదని కాదు. తగినంత నీరు లేనిపక్షంలో అలసట కలగవచ్చు. కాబట్టి చక్కని ఆరోగ్యానికి తగినంత నీరు తీసుకోవాలి.
 
నీరు విత్తనం చెట్టుగా మారేందుకు సహాయపడుతుంది. అలాగే మన శరీరానికి కూడా సహాయపడుతుంది. నీరు కణాల లోపలా, బయటా ప్రవహించడంవల్ల శక్తి ఉత్పన్నమౌతుంది. అది, శరీరంలో ఇతర రసాయన చర్యల ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తితో చేరుతుంది. నీటి వల్ల కణాలలో ఉత్పత్తి అయ్యే శక్తి అవి నరాలలో వేగంగా దూసుకుపోయేలా చేస్తుంది. శరీరంలోని నీటిశాతం అంతరించిపోయిన ప్రొటీన్లు మరియు ఎంజైముల పనితీరుని ప్రభావితం చేస్తుంది.
 
నీరు శరీరంలోని అంతర్గత అవయవాలు తేమను కలిగి ఉండేందుకు సహకరస్తుంది. అదేవిధంగా రక్తం మరియు శోషరసాల వంటి ద్రవాలను సమతుల్యపరుస్తూ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదు, నీరు శరీరం నుంచి "టాక్సిన్స్"ని తొలగిస్తుంది. చర్మపు నిగారంపు మరియు పనితీరు మెరుగుపడాలంటే నీరు చాలా అవసరం. మన శరీరం రోజుకి దాదాపు నాలుగు లీటర్ల నీరు కోల్పోతుంది. కాబట్టి ఆ నష్టాన్ని భర్తీచేసుకోవాలంటే కనీసం దానికి సమానమైన మోతాదులో రోజూ నీళ్ళు త్రాగాలి. నీటిశాతం లోపిస్తే "డీహైడ్రేషన్"కి దారితీస్తుంది. అందువల్ల శరీరానికి నీటిని అందిస్తూ వుండాలి.