శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By kowsalya
Last Updated : శనివారం, 5 మే 2018 (15:39 IST)

వాటర్ ఫాస్టింగ్ వద్దే వద్దు బాబోయ్.. గుండెకు చేటు...

ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడంతో ప్రస్తుతం చాలామంది స్థూలకాయంతో ఇబ్బందిపడుతున్నారు. ఒబిసిటీ ఆవహించాక వ్యాయామాలు, డైట్‌లంటూ ఆహారం తీసుకోవడాన్ని పూర్తిగా తగ్గించేస్తున్నారు.

ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడంతో ప్రస్తుతం చాలామంది స్థూలకాయంతో ఇబ్బందిపడుతున్నారు. ఒబిసిటీ ఆవహించాక వ్యాయామాలు, డైట్‌లంటూ ఆహారం తీసుకోవడాన్ని పూర్తిగా తగ్గించేస్తున్నారు. ఇటీవలి కాలంలో త్వరగా బరువు తగ్గేందుకు వాటర్ ఫాస్టింగ్ అనే విధానం సోషల్ మీడియాలో బాగానే ప్రచారం అవుతుంది. 
 
అయితే వాటర్ ఫాస్ట్ పేరుతో బరువు తగ్గాలనుకునేవారికి గుండె సంబంధిత వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటర్ ఫాస్టింగ్ పద్ధతిని అనుసరించటం ద్వారా ఆకలి వుండదని.. ఇది గుండెపోటుకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశాలే ఎక్కువని.. కేవలం నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం పాటించటం వల్ల కూడా ఇలాంటి దుష్పలితాలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
నీటిని మాత్రం తీసుకుని ఉపవాసాలుండి.. బరువు తగ్గాలనుకుంటే.. ఆ విధానం అవయవాలకు హాని చేస్తుంది. వైద్యుల పర్యవేక్షణలోనే వాటర్ ఫాస్ట్ చేయాలని.. లేకుంటే ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.