బుధవారం, 13 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (14:25 IST)

విటమిన్ సప్లిమెంట్లతో ముప్పే.. స్థూలకాయులుగా మారిపోతారట..

విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతున్నారు. కానీ విటమిన్ సప్లిమెంట్లతో అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి విటమిన్ సప్లిమెంట్లను ఎక్క

విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతున్నారు. కానీ విటమిన్ సప్లిమెంట్లతో అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి విటమిన్ సప్లిమెంట్లను ఎక్కువగా వాడకూడదంటారు. ఈ సప్లిమెంట్ వల్ల రోగనిరోధక శక్తి పెరగడం సంగతెలా ఉన్నప్పటికీ..  వాటిని వాడేవారిలో ఆరోగ్యం గురించి మితి మీరిన ధీమా పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 
 
విటమిన్ సప్లిమెంట్లు తీసుకునే వారు వ్యాయామానికి ఏమాత్రం ప్రాధాన్యమివ్వరని, అంతేకాకుండా, ఏం తిన్నా తమకేమీ కాదనే ధీమాతో రుచిగా ఉన్నవన్నీటిని ఇష్టంగా లాగించేసి స్థూలకాయులుగా మారుతారని, దీనివల్ల గుండెజబ్బులు, బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులకు గురవుతారని అమెరికన్ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో తేలింది.