శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (22:32 IST)

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ), మంగళగిరి హై-రిస్క్ మెడుల్లోబ్లాస్టోమాతో బాధ పడుతున్న 7 ఏళ్ల బాలుడికి విజయవంతంగా చికిత్స చేసింది. ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేసే, వేగంగా పెరిగే బ్రెయిన్ ట్యూమర్‌, హై-రిస్క్ మెడుల్లోబ్లాస్టోమా. ఈ బాలునికి సమగ్రమైన పరీక్షల చేసిన తర్వాత, ఏఓఐలోని వైద్య బృందం ఒక ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ ప్లాన్‌ను ప్రారంభించింది, ఇందులో క్రానియోస్పైనల్ రేడియేషన్ కూడా భాగంగా ఉంది. క్యాన్సర్ కణాలను తొలగించడానికి, వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మెదడు, వెన్నెముక రెండింటినీ లక్ష్యంగా చేసుకుని అందించే రేడియేషన్ థెరపీ యొక్క ప్రత్యేక రూపం ఇది. 
 
బాలునికి చికిత్స పూర్తయిన తర్వాత, బాలుడు గత ఐదేళ్లుగా రెగ్యులర్ ఫాలో-అప్‌లతో డాక్టర్ల  పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ రోజు, అతను క్యాన్సర్ ను జయించాడు, ఎదుగుతున్నాడు. ఇప్పుడు 7వ తరగతి చదువుతున్న ఆ బాలుడు ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాన్ని గడుపుతున్నాడు. విశేషమైన రీతిలో అతను కోలుకోవడం ఏఓఐలో అందించబడిన అధునాతన వైద్య నైపుణ్యం, వ్యక్తిగతీకరించిన సంరక్షణకు నిదర్శనంగా నిలుస్తుంది. 
 
సిటిఎస్ఐ-దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది, ఈ విజయం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఈ ప్రయాణం, ఈ సాహసోపేతమైన యువ రోగికి మరియు అతని కుటుంబానికి మాత్రమే కాకుండా, క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఒక ప్రేరణగా ఉపయోగపడుతుంది. ఏఓఐలో వైద్య నైపుణ్యం మరియు రోగి-కేంద్రీకృత సంరక్షణ కోసం మా నిర్విరామ ప్రయత్నం ఈ విజయాన్ని సాధ్యం చేసింది. దక్షిణాసియా అంతటా ఈ తరహా  అధునాతన చికిత్సలకు అవకాశాలను  విస్తరించడానికి మేము ఏఓఐ వద్ద  కట్టుబడి ఉన్నాము.  ప్రతి రోగి, వారు ఎక్కడ నివసిస్తున్నారు అనే దానితో సంబంధం లేకుండా, క్యాన్సర్ సంరక్షణ పరంగా అత్యున్నత నాణ్యతతో కూడిన  చికిత్సను పొందేలా భరోసా అందిస్తున్నాము.  ఆంకాలజీ కేర్‌ ను మార్చాలనే మా ప్రయత్నంను ఈ కేసు వెల్లడించటం తో పాటుగా మా రోగులకు భవిష్యత్ లో  పూర్తి అవకాశాలు ఉన్నాయని కూడా చూపుతుంది" అని అన్నారు. 
 
మహేంద్ర రెడ్డి, ఆర్ సిఓఓ , ఏఓఐ, ఈ విజయవంతమైన ఫలితానికి దారితీసిన సహకారం మరియు ఆవిష్కరణలను గురించి  నొక్కిచెబుతూ : "ఏఓఐ వద్ద, మా విధానం ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటుంది, రేడియేషన్ ఆంకాలజీలో తాజా పురోగతులను మాత్రమే కాకుండా రోగులు మరియు వారి కుటుంబాలులకు భావోద్వేగ మరియు మానసిక మద్దతుతో సమగ్ర సంరక్షణను కూడా అందిస్తుంది.  ఈ యువ రోగి యొక్క ఐదేళ్ల ప్రయాణం మా వైద్యులు మరియు సహాయక సిబ్బంది మధ్య సౌకర్యవంతమైన జట్టుకృషిని ప్రతిబింబిస్తుంది. మెడుల్లోబ్లాస్టోమా అనేది ఒక సవాలుగా ఉండే రోగనిర్ధారణ, ముఖ్యంగా చిన్నారులలో, మరియు ఇలాంటి సందర్భాలు మా మల్టీడిసిప్లినరీ విధానం యొక్క విలువను హైలైట్ చేస్తాయి. క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రతి బిడ్డ పూర్తిగా కోలుకోవడానికి మరియు ఉజ్వల భవిష్యత్తుకు ఒకే విధమైన అవకాశం ఉందని నిర్ధారించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అన్నారు. 
 
డాక్టర్ మణి కుమార్ ఎస్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఏఓఐ, మంగళగిరి, కేసు యొక్క సంక్లిష్టత గురించి వెల్లడిస్తూ: "మేము 2019లో రోగిని మొదటిసారి చూసినప్పుడు, ముందుకు వెళ్లే మార్గం సవాలుగా ఉంటుందని మాకు తెలుసు. గత ఐదు సంవత్సరాలుగా మేము  అతని పురోగమనాన్ని నిశితంగా పరిశీలించాము. ఈ రోజు, అతను సాధారణ స్థితికి చేరుకుని, ఆరోగ్యంగా ఉండటం మాకు చాలా సంతోషంగా వుంది.  మనం సెప్టెంబర్ మాసంను బాల్య క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నందున, ఈ కేసు, తొలిదశలో రోగనిర్ధారణ, అధునాతన చికిత్స మరియు పీడియాట్రిక్ ఆంకాలజీలో నిరంతర పర్యవేక్షణ, తదుపరి సంరక్షణ యొక్క ప్రాముఖ్యత కు  శక్తివంతమైన రిమైండర్‌గా నిలుస్తుంది" అని అన్నారు. ఈ బాలుడి విజయగాథ ఏఓఐ మంగళగిరిలోని వైద్య బృందం యొక్క దృఢమైన అంకితభావాన్ని మరియు అధునాతనమైన, వినూత్నమైన సంరక్షణను అందించడంలో వారి నిబద్ధతను వెల్లడిస్తుంది.  క్యాన్సర్ చికిత్సలో ఏఓఐ ముందంజలో ఉంది, అన్ని నేపథ్యాల నుండి రోగులకు ఆశ మరియు వైద్యం అందిస్తోంది.