శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (16:01 IST)

ఇండియన్ కుర్రవాళ్లను కుంగదీస్తున్న గుండె జబ్బులు, ఐటీ ఇండస్ట్రీలో మరీ...

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలలో అత్యధికంగా హృదయ సంబంధ వ్యాధులు ప్రధమ కారణంగా వున్నట్లు వెల్లడైంది. కానీ అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, గుండె జబ్బులు కేవలం ఏదో వయసు పైబడినవారికి మాత్రమే పరిమితం కావడంలేదు.
 
పెరిగిన ఒత్తిడి స్థాయిలు, అస్థిరమైన పని-సమతుల్యతతో, భారతదేశ యువతరం కూడా గుండె జబ్బులతో బాధపడుతోంది. యువత గుండె జబ్బులతో బాధపడుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువవుతోంది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన వైద్యుల బృందానికి ఆందోళన కలిగించే పలు విషయాలు వెల్లడయ్యాయి.
 
ప్రస్తుతం అదుబాటులో వున్న వినూత్న పరికరాల ద్వారా భారతీయుల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తూ, సంకెట్‌లైఫ్ పరికరం తీసుకున్న 70,000 పైగా ECG ల నుండి డేటాను సేకరించారు. 24 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు గుండె సమస్యలతో బాధపడుతున్నారనీ, ఈ జనాభాలో ఎక్కువ మంది పురుషులు ఉన్నారని వారి పరిశోధనలు సూచిస్తున్నాయి. 
 
60 ఏళ్లలోపువారికి అధికంగా హృదయ స్పందన రేటును కలిగి ఉందని, ఇది యువతలో పెరిగిన ఒత్తిడి స్థాయిని సూచిస్తుంది. ఇండియన్ హార్ట్ స్టడీ ద్వారా 35 భారతీయ నగరాల్లో 18,000 మంది పాల్గొన్న వారిపై నిర్వహించిన మరో అధ్యయనం ద్వారా ఈ ఫలితాలు నిర్ధారించబడ్డాయి.
 
ముఖ్యంగా హృదయనాళ మరణాలు(సివిడిలు) భారతదేశంలో ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉద్భవించినట్లు తేలింది. ఇది అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. గుండె సమస్యలకు యువ జనాభాలో ఒత్తిడి ఒక ప్రధాన కారణమనీ, అందువల్ల తక్షణ జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.