గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 2 ఆగస్టు 2024 (00:08 IST)

టీకాతో పాటుగా సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా హెపటైటిస్ నివారించవచ్చు

Hepatitis A
2024న ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన పెంచడంతో పాటుగా ఈ సంభావ్య ప్రాణాంతక వ్యాధిని నిరోధించడానికి, నియంత్రించడానికి చర్యలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇది రూపొందించబడింది. కాలేయ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. సంపూర్ణ ఆరోగ్యం పొందటంలో ఇది అత్యంత కీలకం. జీర్ణక్రియ, నిర్విషీకరణ, పోషకాల నిల్వకు బాధ్యత వహించే శక్తివంతమైన అవయవం, కాలేయం. దాని ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, మీ జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
 
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. మితిమీరిన ఆల్కహాల్, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండటం వలన కాలేయ వ్యాధులైన ఫ్యాటీ లివర్ డిసీజ్ మరియు సిర్రోసిస్ వంటి వాటిని నివారించవచ్చు. తగినంతగా నీరు తాగడం, కాలేయ నిర్విషీకరణ ప్రక్రియలో సహాయపడుతుంది.
 
క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయ పడటమే కాకుండా కాలేయ కొవ్వును సైతం తగ్గించటంలో సహాయపడుతుంది, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. హెపటైటిస్ A, Bల బారిన పడకుండా నిరోధించుకోవడం కోసం టీకాలు వేయించుకోవడం, సురక్షితమైన పరిశుభ్రతను పాటించడం వైరల్ హెపటైటిస్‌ను నివారించడంలో కీలకమైన అంశాలు. వైరల్ హెపటైటిస్‌ కారణంగా తీవ్రమైన రీతిలో కాలేయం దెబ్బతినే అవకాశాలు వున్నాయి.
 
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. రక్త పరీక్షలతో కాలేయ పనితీరు పరంగా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించవచ్చు, చికిత్సలు కూడా మరింత ప్రభావవంతంగా ఉంటాయి. మీరు కామెర్లు, అలసట లేదా కడుపు నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తే, వెంటనే వైద్య సలహా తీసుకోండి.
 
ఈ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా, కాలేయం స్థిరంగా ఉంటుంది కానీ అజేయమైనది కాదని గుర్తుంచుకోండి. ఈరోజు కాలేయానికి అనుకూలమైన జీవనశైలిని అవలంబించడం వల్ల రేపు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. కాలేయ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి-ఇది సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి కీలకమైన ముందడుగుగా నిలుస్తుంది.
- డాక్టర్ బి సందీప్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, విజయవాడ.