ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 జూన్ 2024 (22:28 IST)

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

image
అత్యాధునిక మౌలిక సదుపాయాలకు ప్రసిద్ధి చెందిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ‘ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అద్భుతమైన రీతిలో, మల్లారెడ్డి హాస్పిటల్‌లోని అన్ని వార్డు బెడ్‌లు ఇప్పుడు డోజీ యొక్క అత్యాధునిక ఏఐ - శక్తివంతమైన రిమోట్ పేషెంట్ మానిటరింగ్(RPM), ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్(EWS) ద్వారా కాంటాక్ట్‌లెస్, నిరంతర పర్యవేక్షణను కలిగి ఉంటాయి. ఈ అనుసంధానం మెరుగైన రీతిలో రోగికి భద్రత, సౌకర్యవంతమైన సంరక్షణను అందించటం కోసం స్వదేశీ సాంకేతికతను ఉపయోగించుకోవడంలో తమ అంకితభావాన్ని ప్రదర్శించిన, మల్లారెడ్డి హాస్పిటల్‌ను హైదరాబాద్‌లో మార్గదర్శిగా నిలిపింది. 
 
డిజిటల్ పరివర్తన పట్ల మల్లా రెడ్డి హాస్పిటల్ నిబద్ధతకు, డోజీ యొక్క సౌకర్యవంతమైన అనుసంధానితకి ఉదాహరణగా ‘ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్’ నిలుస్తుంది. హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ రేటు, రక్తపోటు, SPO2 స్థాయిలు, ఉష్ణోగ్రత, ఈసీజీ వంటి రోగుల యొక్క ముఖ్యమైన ఆరోగ్య ప్రమాణాలను రిమోట్‌గా పర్యవేక్షించడానికి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను డోజీ అనుమతిస్తుంది. డోజీ యొక్క ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (EWS) కీలకమైన ఆరోగ్య ప్రమాణ ధోరణులను నమోదు చేస్తుంది. రోగులు ఆరోగ్య పరంగా ఎదుర్కొంటున్న క్లినికల్ క్షీణతను ముందుగానే గుర్తించడానికి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలను హెచ్చరిస్తుంది, సకాలంలో వైద్య జోక్యాన్ని అనుమతిస్తుంది. కాంటాక్ట్‌లెస్ వైటల్స్ మానిటరింగ్ కోసం డోజీ ఏఐ-ఆధారిత బల్లిస్టోకార్డియోగ్రఫీ(బీసీజీ)ని ఉపయోగిస్తుంది.
 
"ఈ- వార్డ్స్ కార్యక్రమం ద్వారా, మేము మా ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు రోగి ఆరోగ్య ప్రమాణాలను నిజ సమయంలో పర్యవేక్షించడానికి అవకాశం  ఇస్తున్నాము. ఈ ఏఐ- ఆధారిత అధునాతన సామర్ధ్యం, వైద్యపరమైన క్షీణత యొక్క సంకేతాలను వేగంగా గుర్తించడానికి అనుమతిస్తుంది, సమయానుకూల జోక్యాలను, క్రియాశీల చర్యలను అనుమతిస్తుంది. ఈ కార్యక్రమం రోగి భద్రతను మెరుగుపరచడమే కాకుండా మా అంకితమైన వైద్య నిపుణులకు మద్దతు ఇవ్వడం, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మొత్తం ఆరోగ్య సంరక్షణ ఫలితాలను మెరుగుపరుస్తుంది" అని మల్లా రెడ్డి హాస్పిటల్, హైదరాబాద్, ప్రతినిధి, ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నిత్య అన్నారు.
 
"RPM అమలు రూపాంతరం చెందింది. ఈ సాంకేతికత మాకు అధిక స్థాయి సంరక్షణను అందించడానికి వీలు కల్పిస్తుంది, మా రోగులకు అవసరమైనప్పుడు తక్షణ చికిత్స అందేలా చూస్తుంది" అని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జిజెడి రావు అన్నారు. “RPM యొక్క ప్రయోజనాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇది నిరంతర నిఘాను అందించడం ద్వారా రోగి భద్రతను మెరుగుపరచడమే కాకుండా సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా సమయానుకూల డేటాతో మా ఆరోగ్య సంరక్షణ నిపుణులను శక్తివంతం చేస్తుంది" అని డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్- పల్మనాలజిస్ట్ అన్నారు.
 
మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్‌లో, రోగుల సంరక్షణకు ఉపయోగపడే సాంకేతికత ఏదైనా స్వీకరించటంలో మేము ఏ చిన్ని అవకాశమూ వదిలిపెట్టలేదు. శ్రేష్ఠత కోసం మా అన్వేషణ వైద్య సాంకేతికతలో తాజా పురోగతులను నిరంతరం అన్వేషించడానికి, అమలు చేయడానికి మమ్మల్ని నడిపిస్తుంది. ఈ అచంచలమైన నిబద్ధత మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందజేస్తుంది, ఇది ఆవిష్కరణ, కరుణ ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది అని మల్లారెడ్డి నారాయణ, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ ప్రభు తెలిపారు.
 
"పేషెంట్ ఫస్ట్" సిద్దాంతం, ఆదర్శప్రాయమైన సంరక్షణను అందించడంలో నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ సంస్థ మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్‌తో భాగస్వామ్యం చేసుకోవటం మాకు గౌరవంగా ఉంది. ఈ సహకారం కోడ్ బ్లూ ఈవెంట్‌ల సంభవనీయతను తగ్గించడం ద్వారా రోగి భద్రతను గణనీయంగా పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది” అని డోజీ సిటిఓ మరియు సహ వ్యవస్థాపకుడు గౌరవ్ పర్చాని అన్నారు.