శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 21 అక్టోబరు 2019 (22:23 IST)

ఇవి గుండెనొప్పి రాకుండా కాపాడుతాయి

మనకు ఇంట్లో అందుబాటులో వుండే దినుసుల్లో వున్న ఆరోగ్య రహస్యాలను ఒకసారి చూద్దాం.
 
1. రక్తాన్ని శుభ్రం చేయటానికి, ఉత్సాహం కలిగించేందుకు పసుపు ఎంతో చక్కగా పనిచేస్తుంది.

2. దగ్గు, జలుబు తరిమికొట్టేందుకు మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. ఇవి గుండెకి చాలా మంచిది. గుండె నొప్పి రాకుండా కాపాడుతాయి. కాబట్టి మిరియాలు ఉపయోగించుటం చాలా మంచిది.

3. అల్లం మన శరీరంలోని కడుపు భాగాన్ని శుభ్రంచేస్తుంది. తల్లి పాలను కూడా శుభ్రం చేసే శక్తి దీనికి వుంది.

4. మెంతులు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిని అధుపులో వుంచుతుంది.

5. జీలకర్ర శరీర మొత్తాన్ని శుభ్రపరచు గుణము కలిగినది కాబట్టి దీనిని కూడా పదార్థాల్లో వుపయోగిస్తుండాలి.