బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (10:43 IST)

వీటిని ఆరగించండి.. ఆకలిని తగ్గించుకోండి!

ఆకలి బాగా వేస్తోందా... ఆహారాన్ని ఫుల్‌గా లాగిస్తున్నారా? అయితే, ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని డైట్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఆకలి బాగా తగ్గాలంటే నిత్యం వాల్‌నట్స్‌, సాల్మన్‌ చేపను తినమని సలహా ఇస్తున్

ఆకలి బాగా వేస్తోందా... ఆహారాన్ని ఫుల్‌గా లాగిస్తున్నారా? అయితే, ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని డైట్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఆకలి బాగా తగ్గాలంటే నిత్యం వాల్‌నట్స్‌, సాల్మన్‌ చేపను తినమని సలహా ఇస్తున్నారు. అలాగే, కెనోలా నూనె వాడితే కూడా ఆకలి తగ్గిపోవడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిదట. వీటిల్లో పోలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ పుష్కలంగా ఉన్నాయట. ఇవి హార్మోన్లలో మార్పు తెచ్చి ఆకలిని తగ్గిస్తాయట. అందుకే వీటిని తరచూ తినమని నిపుణులు చెప్తున్నారు. 
 
ముఖ్యంగా వాల్‌నట్స్‌, సాల్మన్‌ చేప వంటి వాటిల్లోనే కాకుండా అలస్కా సాల్మన్‌, ట్యూనా, అవిశె నూనె, గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌, కెనోలా ఆయిల్‌, చేప నూనెల్లో కూడా పోలిఅన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ పుష్కలంగా ఉన్నాయి. అందుకే వీటిని డైట్‌లో తీసుకున్నట్టయితే ఆకలి బాగా తగ్గుతుందని న్యూట్రిషన్లు సలహా ఇస్తున్నారు.