సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (13:07 IST)

వర్షాకాలంలో తినే ఆహారం అరగాలంటే..?

వర్షాకాలంలో తీసుకునే ఆహారం తేలిగ్గా వుండాలి. ఇంకా సులభంగా అరిగేలా వుండాలి. వర్షాకాలంలో ఆకలి, జీర్ణశక్తి పనితీరు మందగిస్తాయి. కాబట్టి తేలిగ్గా అరిగే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కాలంలో పచ్చి కూరగాయలు తీసుకోకూడదు. కూరగాయలను ఉడికించి తీసుకోవడం చేయాలి. ఇంకా సూప్‌ల రూపంలో కూరగాయలను తీసుకోవడం ఉత్తమం. 
 
ఇంకా దుంపకూరలకు దూరంగా వుండాలి. ఆహారంలో శొంఠి, అల్లం, జీలకర్ర, మిరియాలు, వాము వంటివి చేర్చుకుంటే అజీర్తి సమస్య ఎదురుకాదు. ఇవన్నీ కఫం పెరగకుండా, అతిసారం రాకుండా చేస్తాయి. రోజూ కొద్దిగా తేనె తీసుకుంటే కఫ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. 
 
ముఖ్యంగా స్ట్రీట్ సైడ్ ఫుడ్‌కు దూరంగా వుండాలి. ఇంట్లో పరిశుభ్రంగా వండిన ఆహారం తింటే అతిసారం, టైఫాయిడ్‌, కామెర్లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే అల్లంను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెప్తున్నారు.