అవి తింటే శృంగార కోర్కెలు మటాష్...
ఇటీవల కాలంలో ఎక్కువమంది దంపతులు శృంగార పరమైన సమస్యలను ఎదుర్కుంటున్నారు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్దాల వల్ల లైంగిక వాంఛ తగ్గుతుందట. కాబట్టి అలాంటి వాటిని తీసుకోవడం సాధ్యమైనంత వరకూ పరిమితం చెయ్యాలి. అవేంటో చూద్దాం.
1. కృత్రిమంగా తీపిని అందించే పదార్దాలలో ఆస్పార్టేమ్ అనే పదార్దం ఉంటుంది. ఇవి హార్మోన్ల అసమతూకాన్ని కలిగిస్తుంది. దానితో మూడ్ మారిపోతుంది. అది లైంగిక వాంఛల్ని తగ్గిస్తుంది కాబట్టి వీటికి బదులుగా సహజంగా తీపిని అందించే పదార్దాలని ఎంచుకోవాలి. అంటే బెల్లం, తేనె వంటివి తీసుకుంటే మంచిది.
2. రోజుకి రెండు కప్పుల కాఫీ తాగితే హుషారుగా ఉంటుంది. అయితే అంతకన్నా ఎక్కువ తాగడం మాత్రం మంచిది కాదు. కాఫీ హార్మోన్లపై ఒత్తిడి పెరిగేందుకు కారణం అవుతుంది. దాంతో హార్మోన్ల అసమతుల్యత వస్తుంది. అది లైంగిక కోరికలను తగ్గించేలా చేస్తుంది. అలాగే శీతల పానీయాల వల్ల కూడా లైంగిక వాంఛలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
3. చీజ్‌ని తరచూ తీసుకోవడం వలన శరీర టాక్సిన్లు చేరుతాయి. అవి ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా లైంగిక వాంఛలు తగ్గుతాయి.
4. తాజా అధ్యయనాల ప్రకారం కరకరలాడే చిప్స్‌ని ఎక్కవగా తినడం వలన కణాలు, కణజాలం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పరోక్షంగా లైంగిక వాంఛల్ని తగ్గిస్తాయి.