సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 20 జులై 2019 (22:00 IST)

ఇవి తింటే పొట్ట దగ్గర కొవ్వు మాయం...

ఇటీవల కాలంలో చిన్నా పెద్దా వయసుతో సంబందం లేకుండా ఎక్కువ మంది ఊబకాయ సమస్యతో ఇబ్బందుపడుతున్నారు. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఇబ్బందే. ఇది హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా దీనివలన గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఈ కొవ్వుని తగ్గించడానికి మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అవేమిటో చూద్దాం.
 
1. ఒక రోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల ఆహార సంబందిత పీచు అందేటట్లు చూసుకుంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందు కోసం బీన్స్, పప్పు ధాన్యాలు, పండ్లు, ఓట్స్, పొట్టు తీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వీటితో పాటు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్దాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు.
 
2. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేటట్లు చూసుకోవాలి. రోజులో కనీసం వంద కేలరీల పోషకాలు ప్రోటీన్ల నుండి అందేటట్లు జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. ఇందుకోసం మీగడ తీసేసిన పెరుగు, పాలూ చేపలు, గుడ్లూ తింటే మెరుగైన మాంసకృత్తులు అందుతాయి.
 
3. యాపిల్, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి, టమోటో, క్యాబేజి, చిలగడదుంపల్లోనూ పీచు ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో కొవ్వు తక్కువగా ఉండి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వలన పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా ఓట్స్‌తో చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వుని తగ్గిస్తాయి.