గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (17:57 IST)

శీతాకాలంలో మష్రూమ్స్ డైట్‌లో చేర్చుకుంటే?

శీతాకాలంలో పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకుంటే... వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్ డి, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. పుట్టగొడులను సూప్‌లు, సలాడ్ రూపంలో తీసుకుంటే ప్రయోజనం వుంటుంది. 
 
అలాగే శీతాకాలంలో అల్లాన్ని రోజువారీ వంటకాల్లో వాడాలి. వెల్లుల్లిని కూడా కూరల్లో చేర్చాలి. అల్లం, వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గురణాలు వున్నాయి. ఇవి జలుబు, వైరల్ ఫీవర్‌ను నివారిస్తాయి. పెరుగు చలికాలంలో మేలు చేస్తుంది. 
 
శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉత్పత్తికి ప్రో బయోటిక్ ఫుడ్ పెరుగు చాలా అవసరం. ఇవి జీర్ణక్రియను సవ్యంగా సాగేలా చేస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వాపు, ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. బచ్చలి, క్యాబేజీ, బ్రకోలీ, నిమ్మజాతి పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.