శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (15:33 IST)

హిందూ వారసత్వ సంస్కృతి కుంభమేళాకు యునెస్కో గుర్తింపు

హిందువులు అత్యంతపవిత్రంగా భావించి నిర్వహించే కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించింది. కుంభమేళాను వారసత్వ సంస్కృతిగా యునెస్కో ప్రకటించింది.

హిందువులు అత్యంతపవిత్రంగా భావించి నిర్వహించే కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించింది. కుంభమేళాను వారసత్వ సంస్కృతిగా యునెస్కో ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ ట్వీట్టర్‌లో పోస్టు చేసింది. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన యునెస్కో 12వ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈనెల 4వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు 9 వరకూ జరుగుతాయి. వారసత్వ సంస్కృతి కల్పించడానికి రూపొందించిన లిస్టులో కుంభమేళాను చేర్చినట్టు సంస్థ తెలిపింది. లక్షలాది మంది హిందూ యాత్రికులు హాజరయ్యే కుంభమేళాకు వారసత్వ సంస్కృతి హోదాకు కల్పించడం సరైనదేనని యునెస్కో ప్రకటించింది. 
 
కుంభమేళా సమయంలో కోట్లాది మంది హిందువులు నది దగ్గరకు చేరుకుని వేడుక చేసుకుంటారు. ప్రపంచంలో అంత భారీ మొత్తంలో భక్తులు హాజరుకావడం ఒక్క కుంభమేళాకు మాత్రమే సాధ్యం. ఈ క్రమంలోనే కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ జాబితాలో బొత్సవానా, కొలంబియా, వెనీజులా, మంగోలియా, మొరాకో, టర్కీ, యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే వేడుకలు మాత్రమే ఉన్నాయి. 
 
దీనిపై కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మనీష్ శర్మ స్పందిస్తూ, 'మన కుంభమేళాకు ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ గర్వకారణం. ఇది అత్యంత అరుదైన గౌరవం' అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.