మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హోలీ పండుగ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (15:48 IST)

హోలీ వేడుకకు దూరంగా రాంనాథ్ : రాష్ట్రపతి భవన్ ప్రకటన

కరోనా వైరస్ భయం నేపథ్యంలో హోలీ వేడుకకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈసారి హోలీ వేడుకను నిర్వహించడం లేదని రాష్ట్రపతిభవన్‌ తెలిపింది. 
 
ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ట్వీట్‌ చేస్తూ 'కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి, దీన్ని నిరోధించడానికి అందరం కృషి చేద్దాం. హోలీ వేడుకలను ఈ సారి నిర్వహించడం లేదు' అని పేర్కొంది.
 
కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని జనసందోహంతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయమే ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. 
 
తాను కూడా ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేర్వేరుగా తెలిపారు. ఢిల్లీ ఘర్షణల నేపథ్యంలో హోలీ వేడుకలను జరుపుకోవద్దని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెల్సిందే.