ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:06 IST)

రోజూ ఉదయాన్నే లెమన్ జ్యూస్ తాగితే..?

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇవిగోండి.. వెయిట్ లాస్ ప్లాన్స్. ఉదయం నిద్రలేవగానే, ఓ గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి. ఈ హెల్దీ చిట్కా ద్వారా శరీరాన్ని మనస్సును తాజాగా ఉంచుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వలన ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది.
 
ఉదయం నడక లేదా చిన్న పాటి జాగింగ్ వలన త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. ఇది శరీరం ఫిట్‌గా ఉండడానికి, వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్‌ఫాస్ట్‌ను ఎక్కువగా తీసుకోవాలి. 
 
గ్లాసు లెమన్ జ్యూస్‌ను తీసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్‌ను ఖాళీ పొట్టతో తీసుకోవడం వలన చాలా త్వరగా బరువు తగ్గుతారు. అలానే ప్రతి రోజూ ఉదయం, ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి. గ్రీన్ టీకి పంచదారకు బదులుగా తేనెను మిక్స్ చేసి తీసుకోవాలి.
 
రోజంతా ఆకలి అనిపించకూడదనుకుంటే, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా ఎక్కువగా తీసుకోవాలి. అందులోనూ అధిక ప్రోటీన్స్‌ ఉన్న ఎగ్, బ్రౌన్‌బ్రెడ్ వంటి ఆహారాలను రెగ్యులర్‌గా తీసుకోవాలి.
 
మద్యాహ్నాం భోజనానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. భోజనంలో తీసుకొనే పదార్థాల్లో ప్రోటీన్స్, మినిరల్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. వేగంగా బరువు తగ్గాలనుకొనేవారు, ఎక్కువ విశ్రాంతి తీసుకోకూడదు. చిన్నపాటి విరామాలు తీసుకుంటే సరిపోతుంది.
 
అలానే ఆహారంలో విటమిన్స్ మాత్రమే కాకుండా, శరీరానికి మరో ప్రధానమైన విటమిన్ డి చాలా అవసరం అవుతుంది. ఈ విటమిన్ ఉదయం సూర్యరశ్మి వలన పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.