గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:07 IST)

వంకాయలను నూనెలో వేయించి తీసుకుంటే..?

వంకాయను చూస్తే లేని ఆకలి కూడా పుట్టుకొస్తుంది. గుత్తొంకాయ కూర, వంకాయ వేపుడు వంటివి మంచి రుచిని కలిగి ఉంటాయి. అయితే కొంత మంది అపోహలు పెంచుకుని వంకాయ తినరు. దాన్ని తింటే దురదలు పెరిగిపోతాయని విశ్వసిస్తారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు. పైగా వంకాయ దురదలను తగ్గిస్తుంది. దీన్ని తింటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. వంకాయ మనకు అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 
 
నీలం రంగు వంకాయలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. స్థూలకాయ వ్యాధితో బాధపడేవారికి వంకాయ చాలా మంచిది. 
 
ప్రతిరోజూ వంకాయలను నూనెలో కొద్దిగా ఉప్పు, కారం వేసి వేయించుకుని తీసుకుంటే బరువు తగ్గుతారు. అంతేకాకుండా ముత్రాపిండాల్లోని రాళ్లను కరిగించే గుణం వంకాయకు ఉంది. వంకాయను కూరగా కాకుండా పచ్చిడిగా కూడా తీసుకోవచ్చును. వంకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది.