శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (09:40 IST)

కీరదోస ముక్కలతో చర్మం మీద రుద్దుకుంటే...?

కీరదోస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తరచు దీనిని తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. శరీరానికి చల్లదనంతో పాటు చర్మసంరక్షణను అందించేందుకు కీరదోస చాలా మేలు చేస్తుంది. ఎండ ప్రభావం వలన చర్మం కందిపోతుంది. అలాంటప్పుడు కీరదోస ముక్కలతో చర్మం మీద రుద్దుకుంటే సాంత్వన లభిస్తుంది. అలానే టాన్ సమస్య నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
 
కీరదోస ముక్కలు ఉంచిన నీళ్లను రోజూ తాగుతుంటే శరీర పీహెచ్ ఒకేవిధంగా ఉంటుంది. అంతేకాదు, ఈ కీరా ముక్కలను కళ్లపై ఉంచుకుంటే కంటి అలసట పోతుంది. కీరాను సలాడ్స్ రూపంలో తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పీచు పదార్థం అందుతుంది. ఎందుకంటే.. ఈ పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో పాటు తొందరగా ఆకలి వేయదు.
 
బరువు తగ్గాలనుకునే వారికి కీరా చాలా మంచిది. కీరదోస రసం తాగితే చిగుళ్ల గాయాలు తగ్గిపోతాయి. దంతాలు ఆరోగ్యాంగా ఉంటాయి. ముఖ్యంగా నోటి దుర్వాసను తగ్గిస్తాయి. కీరలోని విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. కీరాలోని క్యాల్షియం డయాబెటిస్, కీళ్ల నొప్పులు, ఎముకల బలానికి ఎంతో దోహదపడుతాయి. 
 
కొందరైతే తిన్న ఆహారాలు జీర్ణంకాక సతమతమవుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. కీరదోస తొక్కలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిలో కొద్దిగా ఉప్పు, కారం కలిపి తింటే అజీర్తికి చెక్ పెట్టవచ్చును. దాంతోపాటు శరీరానికి కావలసిన ఎనర్జీని కూడా అందిస్తాయి.