శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (15:29 IST)

ముగ్గురి ప్రాణాలు తీసిన సరదా.. గడ్డకట్టిన సరస్సులో నడిచి..

snow cyclone
ఓ సరదా సంఘటన ముగ్గురి ప్రాణాలు హరించింది. గడ్డకట్టిన మంచులో నడవడం వల్ల వారు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా భారతీయులే కావడం గమనార్హం. ఈ విషాదకర ఘటన అరిజానా రాష్ట్రంలోని క్యానన్ సరస్సు వద్ద జరిగింది. 
 
అరిజోనా రాష్ట్రంలో గడ్డకట్టిన సరస్సుపై నడుచుకుంటూ మంచులూ పడి ఓ మహిళ సహా ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం అరిజోనాలోని కోకోనినో కౌంటీలోని పుడ్స్ కాన్యన్ సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
మంచులో కూరుకునిపోయిన ఈ ముగ్గురిని సహాయక సిబ్బంది వెలికి తీసినప్పటికీ వారి ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతులను నారాయణ ముద్దన, గోకుల్ మెడిసేటి, హరిత ముద్దనగా గుర్తించారు. వీరంతా అరిజోనా రాష్ట్రంలోని చాండ్లర్‌లో నివసిస్తున్నారు. 
 
ప్రస్తుతం నార్త్ అమెరికాలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన మంచు తుఫాను కురుస్తున్న విషయంతెల్సిందే. దీంతో ఆ ప్రాంతాల వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ మంచు తుఫాను కారణంగా ఇప్పటికే 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేలాది విమాన సర్వీసులు రద్దు చేశారు. గృహాలు, వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.