గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:01 IST)

ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విషాదం.. టీటీఈకి షాక్

Kharagpur station
Kharagpur station
ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే టీటీఈ విద్యుద్ఘాతానికి గురైయ్యాడు.
 
ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్ పూర్ రైల్వేస్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్లాట్ ఫారమ్‌పై మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్న టీటీఈ తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైర్) తెగి పడటంతో.. ఆయన అమాంతం వెనుక వున్న ట్రాక్‌పై  కుప్పకూలిపోయారు. 
 
ఈ ఘటన అక్కడి స్టేషన్‌లో వున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అతడి మాట్లాడుతున్న మరోవ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. బాధిత టీటీఈ సుజన్ సింగ్ సర్దార్‌ను హుటాహుటిన రైల్వే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు.