బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (14:38 IST)

కుంకుమ కింద పడితే మంచిదే.. భూమాతకు బొట్టు పెట్టండి..

Kum kum
Kum kum
కుంకుమ కింద పడటం మంచిదేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కుంకుమ కింద పడితే చాలామంది అశుభంగా భావిస్తారు. అయితే అది అపోహ మాత్రమే. 
 
నిజానికి కుంకుమ గానీ కుంకుమ భరిణ కింద పడటం కానీ శుభ సూచకం. భూమాత తనకూ బొట్టుపెట్టమని చేసే సంకేతం అది. ఏదైనా పూజ గానీ వ్రతం గానీ చేసినప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం. 
 
ఇంటికి వచ్చిన అతిథులను సాగనంపే టప్పుడు కూడా పసుపు, కుంకుమ, పువ్వులు ఇవ్వడం ఆనవాయితీ. ఆడవారు తమ సౌభాగ్యానికి చిహ్నంగా భర్త ఆయుష్షు కోసం వివాహిత స్త్రీలు తమ నుదుట కుంకుమ ధరిస్తారు.
 
పసుపు, కుంకుమ ఏదైనా కార్యాలు చేసేటప్పుడు కింద పడితే మీరు భూమాతను మరిచిపోయారు అని ఇక అదే సమయంలోనే భూమాతకు బొట్టు పెట్టి.. మిగతా కుంకుమను చెట్లల్లో వేస్తే సరిపోతుంది.