చైనాలో మళ్లీ భూకంపం - భూకంప లేఖినిపై 5.2గా నమోదు
చైనా దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో ఏకంగా రెండు సార్లు భూప్రకంపనలు కనిపించాయి. ఆదివారం కూడా ఈ భూకంపం సంభవించగా, ఇది భూకంపం లేఖనిపై 5.2గా నమోదైంది. ఈ విషయాన్ని చైనా భూకంప కేంద్రం వెల్లడించింది. ఈ భూకంప కేంద్రాన్ని జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్‌లో భూమి అడుగు భాగంలో పది కిలోమీటర్ల దూరంలో లోతులో గుర్తించారు.
అంతకుముందు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. జూన్ నెలలో కూడా సిచువాన్ ప్రావిన్స్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. ఇరాన్‌లో వచ్చిన భూప్రకంపనలు ప్రభావం యూఏఈ, బహ్రైన్, ఖతార్ తదితర దేశాల్లో కనిపించాయి.