శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (09:32 IST)

మ్యాన్‌హట్టన్‌‌లో ఉగ్రపంజా : అల్లాహో అక్బర్ అంటూ....

అగ్రరాజ్యం అమెరికాలోని మ్యాన్‌హట్టన్ నగరంపై ఉగ్రవాదులు మరోమారు విరుచుకుపడ్డారు. ఓ మతోన్మాది.. అల్లాహో అక్బర్ అంటూ జనంపైకి ట్రక్కుతో దూసుకుపోయాడు. మ్యాన్‌హట్టన్‌లో భారత కాలమానం బుధవారం తెల్లవారుజామున ఈ

అగ్రరాజ్యం అమెరికాలోని మ్యాన్‌హట్టన్ నగరంపై ఉగ్రవాదులు మరోమారు విరుచుకుపడ్డారు. ఓ మతోన్మాది.. అల్లాహో అక్బర్ అంటూ జనంపైకి ట్రక్కుతో దూసుకుపోయాడు. మ్యాన్‌హట్టన్‌లో భారత కాలమానం బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. 
 
ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌) మెమోరియల్‌ దగ్గరలో బైక్‌, పాదాచారులు నడిచే పాత్‌పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఆ తర్వాత ఆగి ఉన్న స్కూల్‌ బస్సును కూడా ట్రక్కుతో ఢీ కొట్టి పారిపోతున్న వ్యక్తిని అమెరికన్‌ పోలీసులు తుపాకీతో కాల్చారు. దీంతో గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు. 
 
ఘటనపై న్యూయార్క్‌ రాష్ట్ర మేయర్‌ స్పందించారు. ఇది ముమ్మాటికీ ఉగ్రదాడేనని ప్రకటించారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సైపోవ్‌గా అధికారులు గుర్తించారు. 2010లో అమెరికాకు వచ్చిన అతనికి గ్రీన్‌ కార్డు కూడా ఉందని చెప్పారు. ట్రక్కును న్యూజెర్సీలోని ఓ డిపోట్‌ నుంచి అద్దెకు తీసుకుని దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సెప్టెంబర్‌ 2011 తర్వాత న్యూయార్క్‌ రాష్ట్రంలో ఇదే అతి పెద్ద దాడిగా న్యూయార్క్‌ పోలీసులు అభివర్ణించారు.