Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆధార్‌తో సమాచారం దుర్వినియోగం కావట్లేదు : బిల్‌గేట్స్‌

భారత్‌లో గుర్తింపు కార్డుగా చెలామణీ అవుతున్న ఆధార్‌తో ఎలాంటి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావడం లేదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాప

Written By pnr
Updated: శుక్రవారం, 4 మే 2018 (09:52 IST)
భారత్‌లో గుర్తింపు కార్డుగా చెలామణీ అవుతున్న ఆధార్‌తో ఎలాంటి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావడం లేదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్‌ నీలేకని ఇలాంటి వ్యవస్థను ఇతర దేశాల్లో అనుసరించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారన్నారు.
 
భారత్‌లో గుర్తింపు కార్డుగా చెలామణీ అవుతున్న ఆధార్ ఇతర దేశాలకు అనుసరణీయమైనదేనా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన అవును అనే సమాధానమిచ్చారు. అంతేకాకుండా, ఆధార్‌తో ఎలాంటి సమాచార దుర్వినియోగ సమస్యా లేదని, అలాంటి వ్యవస్థను ఇతర దేశాల్లో అమలు చేసే విధంగా ప్రపంచ బ్యాంకుకు బిల్ అండ్‌ మిలిందా గేట్స్ నిధులు సమకూర్చిందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆధార్‌పై బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. 
 
'ఆధార్‌ కార్డు వల్ల అందే ప్రయోజనాలు చాలా ఉన్నాయన్నారు. మిగతా దేశాలు ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలి. దీనివల్ల దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందడంతో పాటు ప్రజలు సాధికారతకు ఎంతో తోడ్పడుతుంది. దాని కోసమే ప్రపంచ బ్యాంకుకు నిధులు అందించాం. ఆధార్‌తో ఎటువంటి సమాచార చోరి సమస్యలు ఉండవన్నారు. ఆధార్ అనేది కేవలం ఐడీ వెరిఫికేషన్ స్కీమ్‌ మాత్రమే అని వివరించారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments