శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (14:46 IST)

ఆధార్ అనుసంధానంపై సుప్రీం సీరియస్

మొబైల్ నంబర్లకు ఆధార్ నంబరును అనుసంధానం చేసే విషయంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ తాము ఎప్పుడూ చెప్పలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పైగా, గత 2

మొబైల్ నంబర్లకు ఆధార్ నంబరును అనుసంధానం చేసే విషయంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ తాము ఎప్పుడూ చెప్పలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పైగా, గత 2017 ఫిబ్రవరి 6వ తేదీన ఇచ్చిన తీర్పును కేంద్రం ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుందని వ్యాఖ్యానించింది.
 
ఇదే విషయంపై జస్టీస్ డీవై చంద్రచూడ్ ఓ తీర్పును వెలువరించారు. 'లోక్‌నీతి ఫౌండేషన్ కేసులో సిమ్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ అనుసంధానం తప్పని సరి అంటూ తన ఆదేశాల్లో పేర్కొంది. అలా చేయమని సుప్రీంకోర్టు చెప్పలేదు' అని వివరిస్తూ తీర్పునిచ్చారు. అయితే, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని మొబైల్ నంబర్ వినియోగదారుల గుర్తింపును ధ్రువీకరించాలని చెప్పినట్టు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.