సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (11:13 IST)

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవదహనం

Punjab province
Punjab province
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఏర్పడింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు చెలరేగగా, 20 మంది సజీవదహనమయ్యారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు కరాచీ నుంచి లాహోర్ వెళుతోంది. 
 
ఈ ప్రమాదంలో కొందరి దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతదేహాల గుర్తింపు చేపడతామని అధికారులు తెలిపారు. గాయాలపాలైన ఆరుగురిని ముల్తాన్ నగరంలోని నిష్తార్ ఆసుపత్రికి తరలించారు. 
 
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాద ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.