బలూచిస్థాన్ లాస్‌బెలాలో కూలిన హెలికాఫ్టర్ - ఆరుగురి దుర్మరణం
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ లాస్‌బెలాలో ఆ దేశ ఆర్మీ ఏవియేషన్ హెలికాఫ్టర్ ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై ఆరుగురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్‌లో వరద సహాయక చర్యల్లో నిమగ్నమైవుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హెలికాఫ్టర్ అదృశ్యమైనపుడు బలూచిస్థాన్ లాస్‌బెలాలో వరద సహాయక కార్యక్రమాల్లో ఉందని, ఆ సమయంలో హెలికాఫ్టరులో ఉన్న ఆరుగురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో కార్ప్స్ కమాండర్ 12తో పాటు ఆరుగురు ఉన్నారని, తెలిపారు. ఈ హెలికాఫ్టర్ విందర్ సాసి పన్ను మందిరం మధ్య హెలికాఫ్టర్ కూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
అయితే, ఈ హెలికాఫ్టర్ కూలిపోయి ప్రాణనష్టం జరిగిందన్న వార్తలను పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ నిర్ధారించలేదు. ఈ హెలికాఫ్టర్ వరద సహాయక చర్యల్లో ఉండగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయినట్టు పాకిస్థాన్ ఆర్మీ మాత్రం ఓ ట్వీట్ చేసింది. ఈ కూలిపోయిన హెలికాఫ్టర్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.