బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:01 IST)

శృంగార సమయంలో అవి ధరించకుండా భాగస్వామిని మోసం చేస్తే..?

కండోమ్‌లు ధరించకుండా తమ భాగస్వామిని మోసం చేస్తే.. శృంగార సమయంలో తమ భాగస్వామి కండోమ్ వారికి తెలియకుండా తొలగించినట్టయితే వారిపై దావా వేసే అవకాశం వుంది.

అమెరికాలోని కాలిఫోర్నియా‌ రాష్ట్రం ఇందుకు సంబంధించిన బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. శృంగార సమయంలో తమ భాగస్వామి కండోమ్ వారికి తెలియకుండా తొలగించినట్టయితే వారిపై దావా వేయవచ్చు.
 
కాగా సురక్షితమైన లైంగిక సంబంధం కోసం, లైంగిక సంక్రమణ వ్యాధులను నివారించడానికి ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తున్నారు.

గర్భం దాల్చకుండా ఉండేందుకు కండోమ్‌లను వినియోగిస్తుంటారు. తాజాగా చట్టం ద్వారా ఇకపై శృంగారంలో పాల్గొనే భాగస్వాములు.. ఒకరి అనుమతి లేకుండా మరోకరు కండోమ్ తొలగించడం చట్ట విరుద్దం కానుంది.