27వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న మల్టీమిలియనీర్... ఎవరు?
అమెరికాలో ఓ మల్టీమిలియనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అదీకూడా ఓ లగ్జరీ భవనంలోని 27వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన అమెరికాలోని సెంచురీ సిటీ లాస్ ఏంజెల్స్‌లో జరిగినట్టు ఇంటర్నేషనల్ వెబ్ పోర్టల్ ఒకటి తెలిపింది.
ఈ మల్టీమిలియనీర్ పేరు స్టీవ్ బింగ్. హాలీవుడ్ నటి ఎలిజబెత్ హర్లే మాజీ ప్రియుడు. హాలీవుడ్ మల్టీమిలియనీర్ నిర్మాత. ఈయన వయసు 55 యేళ్లు. ఈయన నిర్మించిన ది పోలార్ ఎక్స్‌ప్రెస్, బీవుల్ఫ్ వంటి ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి.
తాత లియో ఎస్ బింగ్ నుంచి వారసత్వంగా 600 మిలియన్ అమెరికన్ డాలర్ల సంపద ఈయనకు 18 యేళ్ల వయసులోనే వచ్చింది. అప్పటి నుంచి ఈయన మల్టీ మిలియనీర్‌గా మారిపోయాడు. పైగా, మంచి పరోపకారిగా కూడా గుర్తింపు పొందాడు. అలాంటి వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న అంశంపై స్పష్టత రాలేదు.