శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:23 IST)

24 గంటల వ్యవధిలో కొత్తగా 5,642 పాజిటివ్‌ కేసులు

కరోనా మహమ్మారి దెబ్బకు రష్యా సైతం అతలాకుతలమవుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్న తరుణంలో రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రష్యాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 50వేల మార్క్‌ దాటింది. మంగళవారం వరకు దేశవ్యాప్తంగా 52,763 మందికి వైరస్‌ సోకింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,642 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి 456 మంది చనిపోయారు. 
 
మరోవైపు కరోనా వైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా 1,71,244 మంది మరణించారు. ఇందులో యూరప్‌లో మరణించినవారే 1,06,737 మంది ఉన్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల మృతిచెందిన వారిలో అమెరికాకు చెందినవారే అధికంగా ఉన్నారు.

ఈ మహమ్మారి వల్ల అగ్రరాజ్యంలో 42,364 మరణించారు. ఇటలీలో 24,114 మంది, స్పెయిన్‌లో 21,282 మంది, ఫ్రాన్స్‌లో 20,265 మంది, బ్రిటన్‌లో 16,509 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మొత్తం 185 దేశాల్లో విస్తరించిన ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 24,95,667 కేసులు నమోదయ్యాయి. ఇందులో 16,66,165 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. భారత్‌లో ఇప్పటివరకు 18985 కరోనా కేసులు నమోదుకాగా, 603 మంది మరణించారు.