సంబంధిత వార్తలు
- ఈశాన్య చైనాలోని రెస్టారెంట్ భారీ పేలుడు : ముగ్గురు మృతి
- చైనాకు గట్టిగా బుద్ది చెప్పేందుకు సిద్ధమవుతున్న భారత బలగాలు
- గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి
- సుధీర్ఘ అంతరిక్ష యాత్రకు చైనా శ్రీకారం - 183 రోజులు అక్కడే...
- చార్జీలు తగ్గించాలంటూ తాలిబన్ల హుకుం .. నిలిచిన పాక్ ఫ్లైట్ సర్వీసులు
చైనాలో కరోనా కేసులు.. వృద్ధ జంట వళ్లే కోవిడ్ వ్యాపించిందా?
కరోనా పుట్టిల్లు చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు ప్రకటించింది చైనా. అక్కడి అధికారులు వందలాది విమానాలు రద్దు చేశారు. స్కూల్స్ మూసివేశారు. కోవిడ్ పరీక్షల వేగాన్ని పెంచి.. గురువారం భారీగా పర్యాటకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కొన్ని ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా పరిమితులను తగ్గిస్తున్నాయి.
కానీ, చైనా మాత్రం దేశీయంగా అన్నిటినీ మూసివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరిహద్దులను మూసివేయడంతో కరోనా విషయంలో చైనా చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో బాంబు చైనా పేలుస్తుందా అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి.
అధికారులు చెబుతున్నదాని ప్రకారం చైనా వరుసగా ఐదవ రోజు కొత్త కేసులను నమోదు చేసింది. ఎక్కువగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఉంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణంగా పర్యాటకులను పేర్కొంటున్నారు.
జియాన్, గన్సు ప్రావిన్స్ అదేవిధంగా ఇన్నర్ మంగోలియా వెళ్ళే ముందు ఒక వృద్ధ జంట షాంఘైలో పర్యటించారు. రాజధాని బీజింగ్‌తో సహా కనీసం ఐదు ప్రావిన్సులు.. ప్రాంతాలలో సన్నిహిత పరిచయాలతో డజన్ల కొద్దీ కేసులు వారి ప్రయాణంతో ముడిపడి ఉన్నాయి.
వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు చెబుతున్నారు. దీంతో విమాన సర్వీసులు రద్దు చేయడమే కాకుండా.. పర్యాటకులను పూర్తిగా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వారిపై ఆంక్షలు విధించారు.
