1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (21:46 IST)

చైనా నిఘా బెలూన్ భారత గగనతలంపై తిరిగిందా?

Andaman
Andaman
భారత్ గగనతలంపై గత ఏడాది ఓ భారీ చైనా బెలూన్ కనిపించిందని అధికారులు వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అంతకుముందు చైనా బెలూన్‌ను అమెరికా కూల్చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో గత ఏడాది అండమాన్ నికోబార్ దీవులపైనా ఆకాశంలో ఒక పెద్ద బలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణ శాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కానీ అప్పట్లో అదేంటో ప్రజలకు, అధికారులకు అర్థం కాలేదు. 
 
భారత సైన్యం దీన్ని గుర్తించినప్పటికీ, కూల్చివేద్దామా వద్దా అని నిర్ణయం తీసుకునే లోపే నైరుతి దిశగా భూభాగాన్ని దాటి సముద్రతలం పైకి వెళ్లిపోయిందని ఓ కథనంలో వెల్లడించారు. 
 
అప్పట్లో దాన్ని వాతావరణ పరిశోధనల బెలూన్ అనే భావించారు. ఇటీవల చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేసిన పరిణామాల నేపథ్యంలో.. దేశ రక్షణ వ్యవస్థ అప్రమత్తం అయ్యింది. నాడు కనిపించిన బెలూన్ నిఘా వేసేందుకు ఉద్దేశించినదే అయ్యుండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి