శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (22:50 IST)

ఖగోళ అద్భుతం- 1504... 54 ఏళ్ల తర్వాత ఏర్పడే సంపూర్ణ సూర్య గ్రహణం..

solar eclipse
ఏప్రిల్ 8వ తేదీ సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. చాలామంది ఎదురుచూసే ఒక అద్భుతమైన ఈ ఖగోళ ఘటన ఓ ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం 54 సంవత్సరాల తర్వాత ఏర్పడనుంది. ప్రతి 54 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఖగోళ అద్భుతం జరుగుతుంది. 
 
సరోస్ చక్రం అనేది భూమి, చంద్రుడు, సూర్యుడి పునరుద్ధణ కోసం ఏర్పడేది. దీని ప్రభావం కారణంగానే గ్రహణాలు ఏర్పడుతాయి. ఈ క్రమంలో రానున్న గ్రహణం సరోస్ 139లోని ఓ భాగం. ఇది 1504 సంవత్సరానికి తర్వాత ఏర్పడబోతోంది. సరోస్ పరిభ్రమణం 18 సంవత్సరాలు, 11 రోజులు, 8 గంటల పాటు కొనసాగుతోంది. 
 
ఇది మూడు సరోస్ పరిభ్రమణలతో ఏర్పడుతుంది. తద్వారా 54 సంవత్సరాల లోపు ముగుస్తుంది. అంటే ప్రతి 54 సంవత్సరాలకు ఒక్కసారి ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 
 
ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణంతో సూర్యుడు పూర్తిగా కనిపించడు. దీంతో చీకటి కమ్మేస్తుంది. అందుచేత సూర్యుడిని నేరుగా ఈ సమయంలో చూడకూడదు. కంటి రక్షణ కోసం అద్దాలను ఉపయోగించాలి. బైనాక్యులర్‌లు, టెలిస్కోప్ లేదా కెమెరాను ఉపయోగించి సూర్యుడిని చూడకుండా జాగ్రత్త వహించాలి. 
 
సూర్యగ్రహణం సమయంలో, మైమరిపించే డైమండ్ రింగ్ ఆకాశంలో కనిపిస్తుంది. భూమి- సూర్యుని మధ్య చంద్రుడు రావడంతో ఉత్కంఠభరితమైన ఖగోళ సంఘటన ప్రారంభమవుతుంది. సూర్యగ్రహణం ఏప్రిల్ 8న మధ్యాహ్నం 2.12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9న తెల్లవారుజామున 2.22 గంటలకు ముగుస్తుంది. ముఖ్యంగా, సంపూర్ణ గ్రహణం కొన్ని నిమిషాల పాటు ఉంటుంది.