శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (12:55 IST)

రష్యా-ఉక్రెయిన్‌ వార్.. అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు

రష్యా-ఉక్రెయిన్‌పై యుద్ధం మూడు వారాల పాటు జరుగుతోంది. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. ముఖ్యంగా కీవ్ నగరాన్ని ఆక్రమించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. రష్యా దురాక్రమణపై ఉక్రెయిన్ అంతర్జాతీయ కోర్టులో ఫిర్యాదు చేసింది. రష్యా దురాక్రమణపై చర్యలు తీసుకోవాలని కోరింది.
 
ఉక్రెయిన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని ఆపేయాలంటూ తీర్పు చెప్పింది. 
 
రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాలను వెనక్కి రప్పించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అంతర్జాతీయ కోర్టు తీర్పుపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. కోర్టులో మేమే గెలిచామని, ఇంటర్నేషనల్ లా ప్రకారం కోర్టు ఆదేశాలను రష్యా తప్పక పాటించాలని అన్నారు.