బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (21:10 IST)

ఉన్నట్టుండి ఖాతాలో కోటి రూపాయలు పడితే.. పండగ చేసుకోరూ..?

కోటి రూపాయలు ఉన్నట్టుండి ఖాతాలో పడితే ఎలా వుంటుంది. వామ్మో అంటూ ఆశ్చర్యపోతారుగా.. ఇలాంటి పరిస్థితే అమెరికాలోని ఓ వృద్ధుడికి ఎదురైంది. అతడి బ్యాంకు ఖాతాలో రూ. కోటి వచ్చిపడడంతో అతడు షాక్‌కు గురయ్యాడు. రెండు వారాలైనా ఎవరూ సంప్రదించకపోవడంతో ఆ కోటి తనదే అనుకున్నాడు. అయితే ఆ సొమ్మును బ్యాంకు తిరిగి తీసేసుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిన్నెసోటాలోగల క్రిస్టల్‌కు చెందిన థామస్ ఫ్లాహింగ్‌కు 73 ఏళ్లు. అతడికి స్థానిక సన్‌రైజ్ బ్యాంకులో ఖాతా ఉంది. అయితే, ఇటీవల అందులో 150,000 అమెరికన్‌ డాలర్లు అంటే రూ. 1.09 కోట్లు జమయ్యాయి. 
 
మొదట బ్యాంక్‌ తప్పిదం వల్ల వచ్చాయేమో అనుకున్నాడు. కానీ రెండు వారాలైనా ఎవరూ సంప్రదించలేదు. దీంతో ఆ డబ్బులతో ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాడు. అలాగే, మెక్సికో పారిపోవాలని కూడా ఆలోచన చేశాడట. 
 
అనంతరం ప్రభుత్వ సొమ్ము మనకెందుకులే బ్యాంకుకు వెళ్లి చెప్పేద్దాం అని నిర్ణయించుకున్నాడు. ఇంతలోపే బ్యాంక్‌ తన లోపాన్ని గుర్తించింది. ఫ్లాహింగ్‌ ఖాతానుంచి ఆ సొమ్మును తీసేసుకుంది. అదన్నమాట సంగతి.