బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (16:58 IST)

ఎగిరే విమానం నుంచి గార్డెన్‌లో పడిన వ్యక్తి.. ఏమయ్యాడంటే?

విమానంలో దొంగచాటుగా ప్రయాణిస్తున్నాడని అనుమానించే ఓ వ్యక్తి మృతదేహం లండన్‌లోని ఓ గార్డెన్‌లో కనుగొన్నారు. కెన్యా విమానం ఒకటి హిద్రూ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. 
 
ఆ సమయంలో విమానం నుంచి ఓ వ్యక్తి కిందపడి వుంటాడని పోలీసులు అనుమానించారు. నైరోబి నుంచి కెన్యాకు వస్తున్న ఓ ప్యాసింజర్ ప్లైన్‌ నుంచి కిందపడిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీశారు. 
 
ఆదివారం మధ్యాహ్నం 3.40 నిమిషాలకు అతడి మృతదేహాన్ని ఓ గార్డెన్‌లో కనుగొన్నారు. క్లాఫామ్‌లో సన్‌బాత్ వద్ద ఒక కిలోమీటర్ దూరంలో మృతుడు పడినట్లు స్థానికులు చెప్తున్నారు. గట్టి అరుపులు వినడంతో పై నుంచి కిందపడుతున్న వ్యక్తిని చూశామని స్థానికులు అంటున్నారు.