ఆదివారం, 7 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 డిశెంబరు 2025 (22:27 IST)

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

Trump-Putin-Modi
మా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మామూలోడు కాదు, భారత్-రష్యాల మధ్య మైత్రి బంధాన్ని మరింత దృఢతరం చేసారు. ఇందుకుగాను మా ట్రంప్‌కి నోబెల్ బహుమతి ఇవ్వాలని నేను వాదిస్తానంటూ మాజీ పెంటగాన్ అధికారి మైఖేల్ రూబిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత్ ఇచ్చిన గౌరవ మర్యాదలు మరెక్కడా దక్కవన్న ఆయన డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా భారత్-రష్యాలు బాగా దగ్గరయ్యాయని ఆయన అన్నారు. అసలు అమెరికాలో 65 శాతం మంది ప్రజలు ట్రంప్ అంటే ఇష్టం వుండదనీ, ట్రంప్ వల్ల నమ్మదగిన మంచి స్నేహదేశమైన భారత్, రష్యాకి దగ్గరవుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా భారతదేశానికి ట్రంప్ చేసే హితబోధలు ఆపితే బాగుంటుందని అన్నారు.
 
రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయకూడదని ట్రంప్ ఎలా చెప్తారు? ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం దాని అవసరాల కోసం మార్గాలను వెతుక్కుంటుంది కదా. ఇంధనం మనం ఇవ్వలేము, అలాగని వాళ్లు ఎక్కడో వెతుక్కుంటూ ఊరుకోము, ఇదేంటి? త్వరలో తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగబోతున్న భారతదేశానికి తగిన వనరులు అవసరం కదా అని ప్రశ్నించారు. భారతదేశంతో వ్యూహాత్మక సంబంధాలను ట్రంప్ తన వైఖరితో తెగ్గొట్టేస్తున్నారని మండిపడ్డారు. టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాల మాటల్లో పడి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అది అమెరికాకు నష్టాన్ని తప్ప లాభాలను మిగల్చదని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.