సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (12:24 IST)

హిజ్రాతో డాక్టర్ శృంగారం.. తృప్తిలేదని.. చంపేశాడు.. వండి తినేశాడు..

రష్యాకు చెందిన ఓ డాక్టర్ విపరీత నిర్ణయం తీసుకున్నాడు. శృంగారంలో నిరాశ కలగడంతో రష్యాకు చెందిన ఆ డాక్టర్ కిరాతకంగా మారిపోయాడు. అతనితో పాటు శృంగారంలో పాల్గొన్న మహిళను హత్య చేసి వండుకుని తిన్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ఓ డాక్టర్.. మహిళను డేట్ కోసం పిలిపించాడు. ఆపై ఇద్దరు మద్యం సేవించి శృంగారంలో పాల్గొన్నారు. కానీ ఆ డాక్టర్‌కు ఆ తర్వాతే ఓ నిజం తెలిసింది. తనతో శృంగారంలో పాల్గొన్న వ్యక్తి హిజ్రా అని. దీంతో డాక్టర్ షాక్ అయ్యాడు. 
 
అంతే ఆవేశానికి గురైన ఆ డాక్టర్.. డేట్‌లో పాల్గొన్న హిజ్రాను హతమార్చాడు. అంతేగాకుండా.. ఆమె అవయవాల్లో కొన్నింటిని వండుకుని తిన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. సదరు డాక్టర్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.