ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (16:03 IST)

తిమింగలంపై సవారీ చేసిన యువకుడు.. నెట్టింట వీడియో వైరల్

Whale Shark
తిమింగలాలు సముద్రంలో సంచరిస్తాయి. సముద్రపు జంతువులైన ఇవి సముద్రం నీటిపైకి వస్తుంటాయి. నీటి అడుగుభాగంలోనే ఎక్కువగా సంచరించే తిమింగలాలు చాలా బలమైనవి. సముద్రంలోని షార్క్ చేపల్లా అవి హానికరం కాదు. కానీ వాటి జోలికి వస్తే ఊరుకోవు. సౌదీ అరేబియాలోని యంబు పట్టణ తీరంలో ఉన్న రెడ్ సిలో కొంతమంది యువకులు బోటింగ్‌కు వెళ్లారు. 
 
అయితే, వారికి రెండు తిమింగలాలు కనిపించాయి. దీంతో ఓ యువకుడికి దానిపై ఎక్కి సవారీ చేయాలనే కోరిక కలిగింది. వెంటనే ఓ తిమింగలం మీదకు దూకి దాని మొప్పలను గట్టిగ మడిచి పట్టుకున్నాడు. తిమింగలం అక్కడే కాసేపాటు ఉండిపోయింది. 
 
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.  కొంతమంది అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. తిమింగలం వైపు యువకుడు సవారీ చేసిన ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.