సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 21 ఆగస్టు 2020 (14:22 IST)

చిరు ఆచార్యకు మహేష్ మాట సాయం..!

మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుంటే... చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటించనున్నట్టు సమాచారం. 
 
చిరు పుట్టినరోజు సందర్భంగా ఆచార్య మూవీ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఈ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే...మెగాస్టార్ ఆచార్యకు సూపర్ స్టార్ మహేష్‌ బాబు మాట సాయం చేయనున్నారని తెలిసింది. ఇంతకీ మాట సాయం ఏంటి అనుకుంటున్నారా..? అదేనండి మహేష్ బాబు ఆచార్య మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట.
 
అసలు ఈ సినిమాలో మహేష్‌ బాబుతో ఓ కీలక పాత్ర చేయించాలి అనుకున్నారు. మహేష్ బాబు కూడా ఓకే అన్నాడు. అయితే... చిరంజీవి మాత్రం ఆ పాత్రను చరణ్ మాత్రమే చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అందుచేత మహేష్‌ ఓకే అన్నప్పటికీ చరణ్ తోనే చేయిస్తున్నారు. మహేష్ బాబుతో చేయించాలనుకున్న పాత్ర చేయించలేకపోయినా.. ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయిస్తుండడం విశేషం.