శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (11:17 IST)

మసూద్‌ అజర్‌ మా దేశంలో లేడు.. పాకిస్థాన్‌లోనే ఉన్నాడు.. తాలిబన్లు

taliban
జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ తమ దేశంలో లేడని, పాకిస్థాన్ లోనే ఉన్నాడని అఫ్గానిస్థాన్ లోని తాలిబన్లు తెలిపారు. మసూద్‌ అజర్‌ అఫ్గాన్ లోనే ఉన్నాడని, అతడిని పట్టుకోవాలంటూ తాజాగా తాలిబన్లకు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ లేఖ రాసింది. ఇందుకు పాకిస్థాన్ స్పందించింది. 
 
కాగా.. మసూద్‌ అజర్ అఫ్గాన్ లోని నంగ్రహార్‌ ప్రావిన్స్‌ లేదంటే కునార్‌ ప్రావిన్స్‌లో ఉండొచ్చని పాక్‌ అంటోంది. దీంతో తాలిబన్లు ఘాటుగా స్పందించారు. అతడు అఫ్గాన్ లో లేడని, నిజానికి పాక్ లోనే ఉన్నాడని తాలిబన్ల ప్రతినిధి జబివుల్లా ముజాహీద్ చెప్పాడు. జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ పాకిస్థాన్ కు చెందిందని స్పష్టం చేశాడు.
 
పాక్ చెబుతున్న విషయాల్లో నిజం లేదని చెప్పాడు. అఫ్గాన్ విదేశాంగ శాఖ కూడా పాక్ చేసిన ప్రకటనపై స్పందించింది. ఇటువంటి ఆరోపణలు అఫ్గాన్-పాక్ మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి ప్రకటనలు చేయొద్దని చెప్పింది.