శుక్రవారం, 23 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2015 (19:28 IST)

అమ్మాయిలు పొట్టిగా ఉంటేనే అందం.. ''లోఫర్‌'' కథ అమ్మను గుర్తుచేస్తుంది -వరుణ్‌ తేజ్‌

మా ఇంట్లో అందరూ స్టార్లే. మీరు స్టార్‌ అంటూ.. ఇటీవలే విజవాడలో విలేకరులు అడిగారు.. మేం స్టార్లు కాదు.. నటులం మాత్రమే అని చెప్పాను. నేను నటుడ్నే. స్టారను కాదు. అది మాకు వర్తించదు. బేసిక్‌గా నేను చిన్నతనంలోనే నటుడు అవ్వాలనే కోరికతోనే డైరీలో రాసుకున్నాను. అలాగే నటుడ్ని అయ్యాను.. అంటూ తన ఫ్యామిలీలో స్టార్స్‌ గురించి వరుణ్‌తేజ్‌ చెప్పాడు. ఇక లోఫర్ సినిమా అనేది మదర్‌ సెంటిమెంట్‌తో వుంది. కథ చెప్పాగానే బాగా నచ్చి చేసేశానని వెల్లడించాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 17న విడుదలవుతుంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌తో ఇంటర్వ్యూ. 
 
ప్రశ్న: ముకుంద, కంచె అని టైటిల్స్‌ పెట్టి ఈసారి లోఫర్ అన్నారేమిటి? 
జ : మొదట నేను కూడా ఆ పేరు విన్నప్పుడు షాక్‌ అవ్వడమే కాకుండా ఈ టైటిల్‌ ఏంటి అని ఆలోచించాను. కానీ సెట్లోకి వెళ్లి సీన్స్‌ చేస్తున్నప్పుడు ఆ టైటిల్‌ సినిమాకి పర్ఫెక్ట్‌ అని ఫిక్స్‌ అయ్యాను. లోఫర్‌ అనే టైటిల్‌ ఏంది అనే నెగటివ్‌ ఫీలింగ్‌‍లో ఉన్నవారు సినిమా చూశాక టైటిల్‌ పర్ఫెక్ట్‌ అని అంటారు. 
 
ప్రశ్న: అంతగా నచ్చిన అంశేమేముంది? 
జ : ఈ కథలో బాగా నచ్చిన అంశం మదర్‌ సెంటిమెంట్‌. రేవతి గారి సన్నివేశాలు నాకు మా''అమ్మ''ను గుర్తు చేశాయి. ''సువ్వి సువ్వాలమ్మా'' పాటలో నటించేప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ పాటలో ఏడుస్తూ కనిపించాలి. అయితే.. ఎక్స్‌ ప్రెషన్‌ సరిగా క్యారీ అవ్వడం లేదని పూరి గారు ఒకరోజు షూటింగ్‌ కూడా ఆపేశారు. ఆ తర్వాత రెండు రోజులపాటు ఈ పాటను ఏకధాటిన షూట్‌ చేశాం. 
 
ప్రశ్న : మదర్‌ సెంటిమెంట్‌. అమ్మ నాన్న.. చిత్రం తరహాలో వుంటుందా? 
జ : కొద్దిగా అలాంటిదే కానీ.. పూర్తిగా భిన్నమైంది. చేసిందే మళ్లీ చేయరుగదా.. పూరీగారి సినిమాలన్నీ చూశాను. ఈ సినిమా డిఫరెంట్‌ సినిమా. 
 
ప్రశ్న: ఆయన చిత్రాల్లో మీకు బాగా నచ్చింది ఏది? 
జ : రవితేజ చేసిన 'ఇడియట్‌..' ఆ తర్వాత పోకిరి చిత్రాలు బాగా నచ్చాయి. 
 
ప్రశ్న: నలుడికంటే ముందుగా దర్శకుడు అవ్వాలనే పూరీదగ్గర జేరారు.. కంటెన్యూ చేయకపోవడానికి కారణం? 
జ : నాకు చిన్నతనంనుంచే సినిమాలంటే ఇష్టం. అందుకే దర్శకుడు అవ్వాలని.. పూరీగారీ చిత్రాలు ఇష్టమని.. నాన్నగారితో చెబితే.. ఆయన దగ్గర చేర్పించారు. కానీ ఎందుకనో.. కొద్దిరోజులు చేశాక.. నాకు పెద్దగా ఇంట్రస్ట్‌ కలగలేదు. నటుడిగా వుండాలనే అనిపించింది. దాంతో అక్కడ సీన్సే ప్రాక్టీస్‌ చేసేవాడ్ని. చిన్నతనంలోనే నేను నటుడ్ని అవ్వాలనే డైరీలో రాసుకున్నా.. అయితే.. దర్శకత్వం శాఖలో వుండడంవల్ల అన్ని విషయాలు తెలుస్తాయని వచ్చానంతే. 
 
ప్రశ్న:  భవిష్యత్‌లో దర్శకుడు అవ్వే ఛాన్స్‌ వుందా? 
జ : ఏమో చెప్పలేను. ఇప్పుడు నటుడికాగానే కొనసాగుతాను. 
 
ప్రశ్న: మీ ఇంట్లో స్టార్స్‌తోనే మల్టీస్టారర్‌ చేయవచ్చుగదా? 
జ : మంచి కథ దొరికితే. చేయాలనుందని చరణ్‌ చాలాసార్లు చెప్పాడు. కథ దొరికితే కలిసి చేద్దాం అన్నాడు. 
 
ప్రశ్న: చిరంజీవి సినిమాల్లో రీమేక్‌ కోసం ఓ సినిమా సెలక్ట్‌ చేసుకోమంటే, ఏ సినిమా సెలక్ట్‌ చేసుకుంటారు? 
జ : నాకు పెదనాన్న గారి 'ఛాలెంజ్‌' అంటే చాలా ఇష్టం, నాకు ఆ ఛాన్స్‌ వచ్చి, రీమేక్‌ చేయాల్సి వస్తే ఛాలెంజ్‌ సినిమా సెలక్ట్‌ చేసుకుంటాను. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా నా మనసుకు దగ్గరగా ఉంటుంది. 
 
ప్రశ్న: ఎలాంటి ఇమేజ్‌ కోరుకుంటున్నారు? 
జ : నా ప్రతి సినిమాతోనూ నటుడిగా ఎదగాలనుకొంటాను తప్ప.. మాస్‌ ఇమేజ్‌ దక్కించుకోవాలనో లేక మాస్‌ హీరో అయిపోవాలనో అనుకోను. ఒక నటుడిగా నన్ను నేను ఇంప్రూవ్‌ చేసుకొంటూనే.. సరికొత్త కథ-కథనాలను ఎంపిక చేసుకొంటూ ముందుకు సాగడానికి ఇష్టపడతాను. 
 
ప్రశ్న: పూరీ, క్రిష్‌ దర్శకుల్లో ఎవరు బెస్ట్‌? 
జ : సినిమా తీయడంలో పూరి జగన్నాధ్‌ చాలా ఫాస్ట్‌ అని చాలా మంది అనుకొంటుంటారు. నిజానికి పూరి జగన్నాథ్ కంటే క్రిష్‌ సినిమా చాలా ఫాస్ట్‌‌గా తీస్తాడు. క్రిష్‌ ''కంచె'' సినిమాను 55 రోజుల్లో పూర్తి చేస్తే.. పూరి జగన్నాథ్‌కు ''లోఫర్‌'' తీయడానికి 75 రోజులు పట్టింది.
 
ప్రశ్న: మీ ఎత్తుకు సరిపడా హీరోయిన్‌ వెతకడం కష్టమేమో? 
జ : నా హైట్‌ కారణంగా హీరోయిన్‌ విషయంలో కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి రావడం నిజమే. అలాగని అమ్మాయిలు ఆరడుగులుంటే చూడడానికి ఏం బాగుంటారు చెప్పండి. అమ్మాయిలు పొట్టిగా ఉంటేనే అందం. మా అమ్మగారు నాన్నగారుకంటే పొట్టేగదా. చూడ్డానికి బాగుంటారు. 
 
ప్రశ్న: డాన్స్‌ కష్టం కదా ఎలా చేశారు? 
జ : ''లోఫర్‌'' సినిమాలో డ్యాన్స్‌ చేయడానికి ప్రయత్నించాను. నిజానికి నేను మంచి డ్యాన్సర్‌‌ని కాను. అలాగని బ్యాడ్‌ డ్యాన్సర్‌‌ని కూడా కాదు. ఏదో నా శక్తిమేరకు ఫర్వాలేదనిపిస్తాను. 
 
ప్రశ్న: చిత్రంలో ప్రత్యేకతలు? 
జ : మదర్‌ సెంటిమెంట్‌ ఎంత హైలైటో.. అదే స్థాయిలో ఫాదర్‌ క్యారెక్టరైజేషన్‌ కూడా నిలుస్తుంది. ఈ సినిమాలో నాకు ఫాదర్‌‌గా పోసాని కృష్ణమురళి గారు నటించారు. తండ్రీకొడుకులిద్దరూ కలిసి దొంగతనాలు చేస్తుంటారు. ఆ సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉంటాయి. 
 
ప్రశ్న: కావాలనే భిన్నమైన సినిమాలు ఎంచుకుంటున్నారా? లేక వేరే ప్రత్యేక కారణముందా? 
జ : ప్రత్యేక కారణం ఏమీలేదు. నా దగ్గరి ఆ ఆఫర్స్‌ వచ్చాయి చేశాను. అదీ కాక నాకు పర్టిక్యులర్‌గా కమర్షియల్‌ లేదా మాస్‌ హీరో అనే ముద్ర వేసుకోవడం ఇష్టం లేదు. అందరూ నన్నొక మంచి యాక్టర్‌ గా గుర్తు పెట్టుకోవాలి. అందుకే సినిమా సినిమా వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నాను. 
 
ప్రశ్న: ఎలాంటి పాత్ర చేశారు? 
జ : ఇందులో దొంగగా నటించాను. అందుకు కొన్ని సినిమాలుకూడా చూశాను. 
 
ప్రశ్న: మదర్‌ సెంటిమెంట్‌ కదా.. మీ తల్లిగారితో చర్చించారా? 
జ : అసలు కథ గురించి అమ్మగారితో మాట్లాడలేదు. మదర్‌ సెంటిమెంట్‌ అనే తెలుసు. ఎలా వుంటుందనేకూడా అడగలేదు. 
 
ప్రశ్న: క్రిష్‌తో మళ్ళీ చేసే ఆలోచనవుందా? 
జ : ఇటీవలే క్రిష్‌ ఒక స్టోరీ చెప్పాడు. బాగా నచ్చింది. ''కంచె'' తర్వాత క్రిష్‌ డైరెక్షన్‌‌లోనే మరో సినిమా చేయనుండటం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.